ఏపీలో కొత్త ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు చేస్తోంది. జగన ప్రభుత్వ నిర్ణయాలను ప్రక్షాళన చేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో వివాదంగా మారిన వాలంటీర్ల విషయంలో తాజా ప్రభుత్వ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని..రూ 10 వేలు వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో తాజాగా చేసిన ఆఫర్ చర్చనీయాంశంగా మారుతోంది.
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సచివాయాలు, వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. తాజా ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెడుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో పలువురు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసారు. మరి కొందరు కొనసాగారు. ఆ సమయంలోనే చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని..వాలంటీర్లకు రూ 10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే..తాజాగా వాలంటీర్ వ్యవస్థ పైన ప్రభుత్వ నిర్ణయం పై చర్చ మొదలైంది.
తిరిగి ఛాన్స్ ఇస్తారా రాజీనామా చేసిన వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలను కలుస్తున్నారు. జిల్లాల కలెక్టర్లతోనూ సమావేశం అవుతున్నారు. తాము నాటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందని..తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాపోతున్నారు. తమకు తిరిగి వాలంటీర్లుగా బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అయితే, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తూనే…వారి విద్యార్హతలు, నియామకం పైన మార్పులు చేసేలా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాజీనామా చేసిన వాలంటీర్లు మంత్రి అచ్చెన్నాయుడుని కలిసారు. ఆ సమయంలో నాడు జగన్ కోసం రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి ఉద్యోగం కావాలంటే..నాడు ఎవరైతే వారితో బలవంతంగా రాజీనామా చేయించారో..వారి పైన పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆ తరువాత వారంతా తనను కలవాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆ సమధానంతో వాలంటీర్లు డైలమాలో పడ్డారు. దీంతో..వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రభుత్వ విధానం ఏంటనేది త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.అచ్చెన్నాయుడు…