Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
JANASENAఆంధ్రప్రదేశ్రాజకీయం

జనసేనకు ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్న జీవీఎంసీ డ్రైవర్‌.. పవన్ ఆర్థిక సాయం

105 Views

ఈ నెల 10న పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర సభ కోసం ప్రచారం చేసిన జీవీఎంసీ ఆటో డ్రైవర్. వీడియో వైరల్ కావడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు.. డ్రైవర్ లక్ష్మణరావును ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయం తెలియడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు.. ఆయనకు ఆర్థిక సాయం అందజేశారు. త్వరలోనే మరో ఉద్యోగం చూస్తామని హామీ ఇచ్చారు పవన్.

విశాఖ జీవీఎంసీ చెత్తబండిలో జనసేనకు ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్న డ్రైవర్‌కు జనసేనాని అండగా నిలిచారు. విశాఖలో జరిగిన జనవాణి కార్యక్రమంలో అతడికి రూ.50 వేలు సాయం అందించారు పవన్ కళ్యాణ్. మరోచోట ఉద్యోగం చూస్తానని హామీ ఇచ్చారు. కష్ట సమయంలో పవన్ తనకు అండగా నిలిచారని జనసేనానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఆ ఉద్యోగం ఉన్నా.. పోయినా ఒకటే అన్నారు. దేవుడు తనకు వరమిచ్చారని.. అది మాత్రం చాలన్నారు. డ్రైవర్ ఉద్యోగంపైనే కుటుంబం ఆధారపడి ఉందని.. ఉద్యోగం తొలగించినా పార్టీ అధినేత అండగా నిలిచారన్నారు.

ఈ నెల 10న పవన్ కళ్యాణ్ మూడో విడతవారాహి విజయయాత్ర విశాఖలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం జగదాంబ జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సంబంధించి జీవీఎంసీ చెత్త సేకరించే వాహనంలో డ్రైవర్ మైక్‌లో ప్రచారం చేశారు. 10 నుంచి వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని.. పవన్ బహిరంగ సభకు అందరూ రావాలంటూ అనౌన్స్ చేశాడు. ప్రభుత్వానికి చెందిన వాహనంలో ఎలా పార్టీలకు ప్రచారం చేయడంపై కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.

37వ వార్డుకు చెందిన లక్ష్మణరావు జీవీఎంసీ చెత్త తరలించే వాహనానికి కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతోనే ఇలా చేసినట్లు చెప్పారు. ఆయన వాహనంలోని మైక్‌లో వారాహి యాత్ర గురించి ప్రచారం చేయడాన్ని కొందరు మొబైల్స్‌లో వీడియో తీశారు. ఆ తర్వాత అధికారులకు విషయం తెలియడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఇలా వారాహి సభ గురించి ప్రచారం చేస్తే తన ఉద్యోగం కూడా పోతుందని తెలిసి మైక్‌లో అనౌన్స్ చేశాడు.

Related posts

గోదావరి పందెం కోడి కోసం థాయ్‌లాండ్ నుంచి వచ్చారు.. ఆ పుంజుకు అంత క్రేజా!

HJNEWS

ముందే నిర్ణయం తీసుకున్నారు.. యార్లగడ్డ వైసీపీని వీడటంపై సజ్జల స్పందన

HJNEWS

భూమా ఫ్యామిలీలో సీటు పంచాయితీ.. అన్నదమ్ముల మధ్య వార్ తప్పదా, రేసులో మాజీ ఎమ్మెల్సీ కూడా!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్