2019 కి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలది దోపిడీ రాజ్యమని ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్లది పారదర్శక సేవ అని వైకాపా రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ నక్క గాంధీ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం బాపులపాడు దయాల జక్రయ్య గారి ఆవరణం లో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం లో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు నేరుగా పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం వైకాపా అన్నారు. గత ప్రభుత్వాలలో సంక్షేమ ఫలాలు అంటే తెలియని గ్రామాలు అనేకం ఉండేది. కానీ నేడు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు సంక్షేమ పథకాలు నేరుగా చేరుతున్నాయని, నేడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే లబ్ధిదారులకు పెన్షన్ అందుకుంటున్నారు. అది ఒక్క వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం తోనే సాధ్యమైందని చెప్పారు. కానీ నేడు 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమించడంతో మారుమూల పల్లెలకు కూడా వెళ్లి వారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తెలియజేసి వాటిని పార్టీలకతీతంగా లబ్ధిదారు లైన ప్రతి ఒక్కరూ పొందేలా వాలంటీర్లు పారదర్శకమైన సేవ చేస్తున్నారని చెప్పారు. మండలంలో 475 మంది వాలంటీర్లు ఉన్నారని, వారిలో ఇద్దరికీ సేవా వజ్ర, ఐదుగురు కి సేవా రత్న, మిగిలిన వారికి సేవా మిత్ర అవార్డులు వరించాయని తెలిపారు. అవార్డులకు ఎంపికైన వాలంటీర్లకు స్థానిక ప్రజా ప్రతినిధులు, వైకాపా నాయకులు కలిసి అవార్డులు అందించారు. అవార్డులు పొందిన వారిని దుస్సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన జన్మభూమి కమిటీలకి, వైకాపా ప్రభుత్వంలో పని చేస్తున్న వాలంటీర్ వ్యవస్థకు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. జన్మభూమి కమిటీలది దోపిడీకి పాలనైతే , వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందజేసే పాలన అని వారు కితాబిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వలభనేని వంశీ మోహన్, ప్రజా ప్రతినిధులు, వైకాపా నాయకులు కలిసి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో అన్ని గ్రామాలలో తిరగడమే గాక వాలంటీర్లను ముందు ఉంచుకుని ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడమే గాక ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రస్తుతం తమ ప్రభుత్వం అమలు చేస్తున్నవేనని, వాటికి పేర్లు మార్చి, కాపీ పేస్ట్ అనే చందంగా తెలుగుదేశం నాయకులు ప్రచారం ప్రారంభించారని నాయకులు ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ యార్రగోర్ల నగేష్, జడ్పిటిసి కొమరవెల్లి గంగాభవాని, క్రిస్టియన్ మైనార్టీ సెల్ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి కొమరవెల్లి కిరణ్ మూర్తి, మండల గృహ సారదుల కన్వీనర్ అవిర్నేనీ శేషగిరి, కో ఆఫ్షన్ సభ్యులు షేక్ తానీషా, వీరవల్లి బ్యాంక్ చైర్మన్ అల్లాడి థెరిస్సా, ఏ.యం.సి మాజీ డైరెక్టర్ కొడిబోయిన బాబీ, వీరవల్లీ గ్రామ కన్వీనర్ గూడవల్లి రత్న సుధాకర్, గ్రామ సర్పంచులు బాపులపాడు సరిపల్లి కమలా భాయ్, నరసన్నపాలెం అడపా అంజి బాబు, రంగయ్య అప్పారావు పేట కానుకలు అన్నా మణి, రేమల్లి చౌటపల్లి భారతి, వెలేరు సుదిమెళ్ళ సుందరమ్మ, ఆరుగొలను ముల్పురి లక్ష్మి, అంపాపురం కాకాని సంజయ్, ఓగిరాల ఖగ పద్మావతి, మడిచర్ల అజ్మీరా శాంతమ్మ, బండారు గూడెం మాజీ సర్పంచ్ వడ్లమూడి తిరుపతి రావు, మడిచర్ల సీనియర్ నాయకులు చెరుకూరి శ్రీనివాసరావు, కోట ప్రకాష్, వార్డు మెంబర్ లు, మండలం లోని సచివాలయాల సిబ్బంది, సెక్రెటరీ లు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ వాలంటీర్ లు పాల్గొన్నారు.