Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ఫిక్స్..అమ్మాయి ఎవరంటే..

138 Views

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ యువ రాజకీయ నేత త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వంతో పాటు..ప్రజాభిమానాన్ని పొందుతున్న వంగవీటి రాధ ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ డేట్ ఫిక్సైంది.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కి చెందిన ఓ యువ రాజకీయ నేత త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వంతో పాటు..ప్రజాభిమానాన్ని పొందుతున్నారు వంగవీటి రాధ. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువనాయకుడు మొదట కాంగ్రెస్ ఆ తర్వాత ప్రజారాజ్యం, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి కాపు కాస్తున్న వంగవీటి రాధ త్వరలో పెళ్లి కొడుకుగా మారబోతున్నారు. వంగవీటి రాధ (Vangaveeti Radha)ఎంగేజ్‌మెంట్

(Engagement) ఈనెల19వ తేదిన జరగనుంది. సెప్టెంబర్‌ (September)6వ తేదిన వివాహం ముహుర్తం నిశ్చించినట్లుగా తెలుస్తోంది. ఈ యువనాయకుడు నరసాపురంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బ్యాచిలర్‌గా ఉన్న వంగవీటి రాధ పెళ్లి (Marriage)చేసుకోబోతున్నారనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు, రాజకీయ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వంగవీటి రాధ వివాహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఏపీ రాజకీయాల్లో పరిచయం చేయనవసరం లేని పేరు వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహనరంగా వారసుడిగా రాజకీయల్లోకి అడుగుపెట్టిన రాధా గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. చాలా కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న ఈ యువనేత ..అతి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. నరసాపురంకు చెందిన అమ్మాయితో ఈనెల 19న నిశ్చితార్ధం జరగనుంది. వచ్చే నెల 6వ తేదిన వంగవీటి రాధ వివాహానికి ముహుర్తం నిశ్చయించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా, వంగవీటి రంగా వారసుడిగా వంగవీటి రాధకృష్ణకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్, అభిమానులున్నారు.

వంగవీటి రాధకృష్ణ తొలిసారిగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉండి తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలనేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ జనసేన , లేదా వైసీపీలోకి కూడా వెళ్తారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు, ఏపార్టీలో ఉంటారనే అంశంపైనే చర్చ నడుస్తోంది.

అయితే వంగవీటి రాధ పెళ్లి ప్రస్తావన ఇప్పటి వరకు రాలేదు. నాలుగు పదుల వయసు దాటిన ఈ యువనేత పెళ్లి చేసుకుంటారా లేదా అనే సందిగ్ధంపై అందరిలో ఉండేది. షడన్‌గా పెళ్లి వార్త తెరపైకి రావడంతో రంగా, రాధ అభిమానులతో పాటు ఆయన మద్దతుదారులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

చిచ్చుపెట్టిన సెల్‌ఫోన్‌

HJNEWS

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్

HJNEWS

‘మల్కాజిగిరి ఎంపీ మిస్సింగ్’.. కలకలం రేపుతోన్న పోస్టర్స్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్