Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
సినిమా వార్తలు

ఆడవాళ్లే బట్టలిప్పి పోలీసులపై దాడి చేశారు.. మణిపూర్ ఘటనపై కరాటే కళ్యాణి దారుణమైన పోస్ట్

మణిపూర్ ఘటనను నిరసిస్తూ దేశం మొత్తం ఆందోళన బాటపడితే.. ఆ మహిళలే పోలీసుల బట్టలిప్పి దాడి చేశారంటూ కామెంట్స్ చేసింది బీజేపీ నాయకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి.

సభ్య సమాజం తలదించుకునే ఘటన మణిపూర్‌లో జరిగింది. ఇద్దరు ఆదివాసీ స్త్రీలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించారు. వాళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ.. ఇష్టం వచ్చినట్టు ఎక్కడపడితే అక్కడ పట్టుకుని యావత్‌ దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఈ అమానుష ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో నిరసనల బాట పట్టారు. మే 4న చోటుచేసుకున్న ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మణిపూర్‌లో కుకీ మహిళలపై దాడులకు తెగబడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో.. బీజేపీ నాయకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి వివాదాస్పద కామెంట్ చేశారు. ‘ఆ మహిళలే బట్టలు విప్పి పోలీసులపై దాడి చేశారని.. వాళ్లని చూస్తే అసహ్యం వేస్తుందంటూ కామెంట్ చేసింది కరాటే కళ్యాణి.

తాజాగా కరాటే కళ్యాణి ఆమె ఫేస్‌ బుక్‌లో జాతీయ జెండాని తగులుబెట్టిన ఘటనను ఖండిస్తూ తనదైన శైలిలో స్పందించింది. ‘‘భారతదేశంలో ఉంటూ తింటూ.. జాతీయ జెండాను తగలబెట్టిన డాష్ గాళ్లని కోసికారమ్ పెట్టాలి.. థూ మీ బతుకుచెడా’’ అంటూ పోస్ట్ పెట్టింది కరాటే కళ్యాణి. అయితే వీటిపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మాటా మాటా పెరిగి.. ఇష్యూ మణిపూర్ ఘటన వైపుకి మళ్లింది. వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లడంతో.. కళ్యాణి క్యారెక్టర్ గురించి దారుణంగా కామెంట్స్ చేయడంతో.. కళ్యాణి కూడా ఎక్కడా తగ్గకుండా అమ్మలు, అక్కలు అంటూ బూతులతో రెచ్చిపోయింది.

‘‘ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళకి… భారత దేశం జెండా అవసరము లేదు అని అర్థం అవుతుంది పోని వెళ్ళిపో వచ్చుగా దేశం వదిలి’ అని కళ్యాణి కామెంట్ చేయడంతో.. ‘అంటే అమెరికాలో కెనడాలో ఇతర దేశాల్లో ఉండే భారతీయులు మీ లెక్క ప్రకారం దేశ ద్రోహులు అంతేనా’ అంటూ ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. ‘ఇక్కడ కూడా వేరే దేశం వాళ్ళు బ్రతుకుతున్నారు.. మరి వాళ్ళు దేశద్రోహం చేశారు అంటారా బ్రతకడం కోసం ఎవరు యెక్కడ ఉన్నా మన అమ్మని మర్చేయ్యం కదా ఇది అలాగే’ అంటూ కౌంటర్ ఇచ్చింది కళ్యాణి.

దీంతో మీరా కళ్యాణీ గారూ జాతీయ జెండా గురించి మాట్లాడేది?? ‘మీరు బాగా ఇష్టపడే ఆరెస్సెస్ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని 52 సంవత్సరాల పాటు… ముట్టుకోలేదు.. ఒప్పుకోలేదు.. మీరు దేశ భక్తి గురించి చెప్పకండి.. దెయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉంది’ అంటూ గతంలో జరిగిన వాటిని ఓ నెటిజన్ గుర్తు చేయడంతో.. ‘ముందు మీలాంటి వాళ్లని పంపేయాలి దేశం బయటకి’ అంటూ స్పందించింది కరాటే కళ్యాణి.

‘‘అబ్బో పోడుకుచుకొని వచ్చేవే అక్క.. మొన్న మణిపూర్‌లో మీ మన సాటి ఆడ మనిషిని బట్టలు లేకుండా ఊరేగించినప్పుడు పొడుచుకోరాలేదే? ఏమది కారణం?’’ అని నెటిజన్ ప్రశ్నించడంతో.. ‘అన్ని తెలుసు.. ముందు నేను అలాగే పాపం అని పోస్ట్ పెట్టా.. తరువాత నిజం తెలిసింది. ఆడవాళ్లే బట్టలు విప్పి పోలీసులపై దాడి చూసాకా అసహ్యం వేసింది.. అది అందరికీ తెలిసు గానీ పోయి పని చూసుకో’ అంటూ స్పందించింది కరాటే కళ్యాణి.

దేశం మొత్తం ఆ మహిళలపై జరిగిన దాడి ఖండిస్తుంటే.. నీకు ఈ విషయం ఎక్కడ తెలిసింది అక్కాయ్.. ఏ వాట్సాప్ యూనివర్సిటీలో చూశావ్.. అంటూ కరాటే కళ్యాణికి పెట్టిన కామెంట్‌కి కౌంటర్ వేస్తున్నారు నెటిజన్లు. ‘పవిత్రమైన జాతీయ జెండా గురించి అపవిత్రమైన నీవు మాట్లాడం వింతగా వుంది కళ్యాణీ’ అని ఓ నెటిజన్ కరాటే కళ్యాణి గతాన్ని తవ్వడంతో.. ఘాటుగా స్పందించింది కరాటే కళ్యాణి.

‘నీ దృష్టిలో అపవిత్రం అంటే ఏంటి రా.. కాస్త చెప్పు బె*వ..kuf.. మీ ఇంటిలో వాళ్ళు నువ్వు పక్కనే ఉండగా అపవిత్రం అవుతున్నారు అది చూసుకోరా.. లా..fuట్’ అంటూ రిప్లై ఇచ్చింది. దానికి కౌంటర్‌గా ఆ వ్యక్తి.. ‘పచ్చ కామెర్లవాళ్లకి లోకం అంతా పచ్చగా కనపడినట్లు.. నీ లాంటి దానికి లోకం అంతా నీలానే కనపడుతుందిలే’ అంటూ కౌంటర్ ఇచ్చాడు నెటిజన్.

అయినా జాతీయ జెండా గురించి మీ బీజేపీ వాళ్లు మాట్లాడటమే హాస్యాస్పదంగా ఉంది అక్కాయ్.. ఇదేనా అక్కా త్రివర్ణ పతాకానికి మీరిచ్చే విలువ? మీ BJP సన్నాసులే అసలైన దేశ ద్రోహులు. ఫస్ట్ మీరు దొబ్బేయొచ్చు ఈ దేశం నుంచి.. ఏంటి మణిపూర్‌లో ఆడవాళ్ళే పోలీసుల ముందు బట్టలు విప్పారా �� అసలు ఆ న్యూస్ ఎక్కడ జరిగిందో.. నీకు తెలుసా? అక్కాయ్.. వాట్సాప్ యూనివర్సిటీలో బాగానే చదువుకున్నావ్ అక్క నువ్వు. ����’ అంటూ హేళనగా నవ్వుతూ.. గతంలో ఆర్ఎస్ఎస్ వాది, కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప జాతీయ జెండాపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.

‘RSS జెండా జాతీయ జెండాగా మారుతుంది.. భవిష్యత్‌లో ఏదో ఒకరోజున త్రివర్ణ పతాకం స్థానంలో RSS జెండా జాతీయ జెండాగా మారుతుంది’ అని ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కళ్యాణి జాతీయ జెండాపై చేసిన కామెంట్స్‌పై కౌంటర్లు ఇస్తున్నారు. వదిలేయండి బ్రో.. అదో తింగరబుచ్చి.. నాలెడ్జ్ లేకుండా పోస్ట్‌లు పెడుతుంది.. అంటూ కళ్యాణి పోస్ట్‌పై స్పందిస్తూ.. రిపోర్ట్‌లు కొడుతున్నారు. తనపై పగపట్టి రిపోర్ట్‌లు కొడుతున్నారంటూ మరో కామెంట్ పెట్టింది కళ్యాణి. అయితే ఈ దూషణల పర్వం కొనసాగుతూనే ఉంది.

Related posts

భోళా శంక‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. మాస్ రేంజ్‌లో మెగాస్టార్ ర‌చ్చ‌

HJNEWS

నడి రోడ్డుపై అరియానా అందాల ఆరబోత.. బిగ్ బాస్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ గ్లామర్ డోస్

HJNEWS

ది మోస్ట్ స్టైలిష్‌గా విజయ్.. ఖుషి టైటిల్ సాంగ్ వైరల్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్