Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

కర్నూలు: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. 3 గంటలసేపు నరకం, ఆ తర్వాత!

141 Views

కర్నూలు జిల్లాలో ఓ యువకుడు మేక పిల్ల కోసం వెళ్లి అనుకోని ప్రమాదంలో పడ్డాడు. స్థానికుల సాయంతో సురక్షితంగా బయటపడ్డాడు.ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. పాపం మేకను వెతకడానికి వెళ్లిన యువకుడు ఊహించని ప్రమాదంలో పడ్డాడు. కొద్దిసేపు నరకయాతను అనుభవించాడు. వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు యువకుడ్ని రక్షించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో మేకలను మేపడానికి రాజేష్ అనే యువకుడు వెళ్లాడు. ఇంతలో మేక పిల్ల తప్పిపోవడంతో వెతకడానికి రాజేష్ సాయంత్రం కొండపైకి వెళ్లాడు. ఈ క్రమంలో అతడి కాలు జారి రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. రాజేష్ తాను రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సమాచారాన్ని స్థానికులు ఎలా తెలియాలో అర్థంకాలేదు.రాజేష్ అతి కష్టం మీద తన జేబులో ఉన్న మొబైల్‌ను తీసి స్థానికులకు ఫోన్ చేశాడు. వెంటనే స్థానికులు కొండపైకి వెళ్లి తాడు సహాయంతో యువకుడు రాజేష్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.. కానీ సాధ్యపడలేదు. మూడు గంటల పాటు రాజేష్ రెండు బండల మధ్య ఇరుక్కుని నరకం అనుభవించాడు. స్థానికులు అతి కష్టం మీద రాజేష్‌ను బయటకు తీశారు. ఒకవేళ రాజేష్ దగ్గర మొబైల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదోనని స్థానికులు చర్చించుకున్నారు. తనను బయటకు తీసేందుకు సాయపడిన స్థానికులకు రాజేష్ ధన్యవాదాలు తెలిపాడు.

Related posts

విజయవాడ దసరా ఉత్సవాల రద్దీ.. భక్తుల కోసం రూ.25 లక్షల లడ్డూ ప్రసాదాలు

HJNEWS

హ్యాకింగ్ కి గురైన నటుడు ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్!

HJNEWS

హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్