తెలంగణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణిలో కీలక మార్పులకు అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. రైతు తనకు చెందిన భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు అమ్మిన దానిలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. ఎందుకంటే రైతుల భూమిలో కొంత భాగాన్ని అమ్మినా కూడా ఆ రైతు ఖాతాలో పూర్తి విస్తీర్ణం కొనసాగుతోంది. తాజాగా ఇచ్చిన అవకాశంతో విక్రయించిన భాగాన్ని గుర్తించి దాన్ని మార్పులు చేసేందుకు కలెక్టర్ లాగిన్లో సాధ్యపడుతుంది. దీంతో పాటు ధరణి పోర్టల్లో మరో అయిదు మాడ్యుళ్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందులో కొన్నింటిని కలెక్టర్ లాగిన్ చేసే విషయంలో అలాగే మరికొన్ని తహశీల్దార్ సమక్షంలో మార్పులు చేసే సదుపాయం తీసుకొచ్చారు.
భూ వినియోగానికి సంబంధించిన భూమిలో సర్వే నంబర్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. భూవినియోగ విధానంలో మార్పు అయిన భూములు, ఇళ్ల స్థలాలకు సర్వే నెంబర్లు లేని వాటికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నెంబర్ల లేని ప్రభుత్వ భూములకు కూడా వర్తిస్తుంది. అలాగే ఆ భూమి దానికి సంబంధించిన యజమానిది కాకుండా ఒకవేళ పొరపాటుగా ఇతర ఆధార్ కార్డు నంబర్లు అనుసంధానమైనా కూడా మార్చుకునే అవకాశమిచ్చారు. పలు సంస్థలకు ఇచ్చిన పట్టాలకు సంబంధించి తప్పులు ఉంటే కూడా వాటిని కలెక్టర్ల లాగిన్లో మార్పులు చేసుకోవచ్చు. అలాగే నకిలీ సర్వే నంబర్లు ఉన్నా.. ఒకవేళ ఒకే నంబర్ రెండు సార్లు నమోదైనా వాటిలో మార్పులు చేసేందుకు తహశీల్దార్ లాగిన్లో సదుపాయం కల్పించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ ఆధార్ కార్డు నంబర్లు తప్పుగా అనుసంధానమైనట్లైతే వాటిని తహశీల్దార్ లాగిన్లో మార్పులు చేయవచ్చు.
previous post