Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
TELUGUDESAMఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందే టీడీపీ అభ్యర్థికి షాక్.. ఆయన భార్య, ప్రొఫెసర్ లావణ్య దేవి సస్పెండ్

24 Views

ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన భార్య లావణ్య దేవి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమె ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆమె వివరణ కూడా ఇచ్చారు.. తాజాగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఏయూ రిజిస్టార్ ఉత్తర్వులు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది.. జూన్ 4న ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య దేవిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీ చేశారు.. ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో డాక్టర్ లావణ్య దేవి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గాజువాక నియోకవర్గం నుంచి టీడీపీ అభ్యర్గాథి పల్లా శ్రీనివాసరావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య లావణ్య దేవి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి.. ఈ నెల 4న గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయ. ఈ మేరకు ఆమెకు రిటర్నింగ్‌ అధికారి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.. ఈ నోటీసుపై ఆమె సమాధానం ఇచ్చారు. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీవాణి అనే మహిళను వ్యక్తిగత పనిమీద కలిసేందుకు వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. తాను స్వతహాగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని తన వివరణలో పేర్కొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు లావణ్య దేవిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు ఆంధ్ర యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ఈ సస్పెన్షన్ సమయంలో ఆమె కచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాలని.. అంతేకాదు వర్శిటీ రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వకుండా జిల్లా కేంద్రం దాడి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే లావణ్య దేవి ఇచ్చిన వివరణకు సంబంధించిన అంశంపై క్లారిటీ రాలేదని చెబుతున్నారు. ఆమె ఇచ్చిన వివరణను ఉన్నతాధికారులకు పరిశీలించారా లేదా అన్నది తెలియదని పల్లా వర్గం అంటోంది.

Related posts

ఏపీ: ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు వారం రద్దు

HJNEWS

రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని

HJNEWS

భారత్‌లో అంత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసా..? ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తే ఎంతో సరదా!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్