అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పూర్తి మద్యనిషేదం విథిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినందున, ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు, కుటుంబ సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా మద్యపానంపై నిషేధం విధించాలని కోరుతూ యంపిజే- ఏపి రాష్ట్ర వ్యాప్తంగా నేడు మద్యవ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు వినతిపత్రాలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అమరావతిలోని సచివాలయంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఎమ టి కృష్ణబాబుకు వినతిపత్రం ఇచ్చిన యంపిజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, ఉపాద్యాక్షుడు షేక్ ముస్తఫా, కార్యవర్గ సభ్యుడు యం డి యూసుఫ్, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు షేక్ అయ్యూబ్, డి చాంద్ బాషా లు పాల్గొన్నారు.