భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలను వివిధ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుద్దామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా , స్వాతంత్రోద్యమ వీరుడిగా… ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని తెలిపారు. దళిత అభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
