కొత్తగూడెం లీగల్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. కేసు వివరాలు భద్రాచలం కు చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కల్లూరు వెంకటేశ్వరరావు 2017 నవంబర్ 19 న భద్రాచలం టౌన్ పోలీస్ వారికి ఇచ్చిన తన ఫిర్యాదులో భద్రాచలం టౌన్ శ్రీ కృష్ణ దేవాలయం కు చెందిన సత్రం లీజు కు నడుపుతున్న స్వరాబు రామకృష్ణ తన సత్రం నందు హత్య జరిగినదని తెలుపగా ఆ సత్రంనకు వెళ్లి తెలుసుకోగా ది.2017-11-18 న భార్యాభర్తల మని చెప్పి బి. నగేష్ బి. అనిత అని వారిది ఖమ్మం అని తెలుపగా 102 రూమ్ ఇచ్ఛామని, తదుపరి ముగ్గురు వచ్చి ఆ పేరు గలవారు మావాళ్ళే అని తెలుపగా రూమ్ నె. 104 అలాట్ చేశామని తెల్లవారి వారు వెళ్లిపోయారని రూమ్ ఊడుచుటకు పని మనిషి వచ్చి చూడగా బెడ్ పై రక్తపు మరకాలున్నాయని, రూమ్ లోని బాత్రూం లో మహిళ శవం ఉన్నదని చూపించిగా, చూసి భద్రాచలం టౌన్ పి. ఎస్. లో అప్పటి ఏ. ఎస్. ఐ. బి. హరిసింగ్ కు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తులో, కామేపల్లి మండలము పొన్నేకల్లుకు చెందిన వెల్దాసు సత్తయ్య కుమార్తె అనిత ను గోపి కి ఇచ్చి వివాహం చేశారని, వారికి ఇద్దరు పిల్లలు అయిన తదుపరి, కారేపల్లి మండలం లింగ్యాతండా కు చెందిన బోడ నాగేశ్వరరావు @ నగేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నదని చాలాసార్లు పంచాయతీలు జరిగి పంచాయతీలో తీర్మానం చేసినప్పటికిని ఎవరికీ వారే ఉండాలి అని తీర్పు ఇచ్చినారు, అనిత తన భర్త గోపితో విడాకులు తీసుకున్నది. తదుపరి అనిత తన పిల్లలు పెద్దవాళ్ళావుచున్నారు నాగేశ్వర్రావును రావద్దని చెప్పినప్పటికి వస్తుండే వాడని మల్లీ అనిత మరొకరి తో ఉంటున్న దనే అనుమానం తో నాగేశ్వరావు పంచాయతీ పెట్టగా నాగేశ్వర్ రావు కు రు. పది వేలు జరిమానా వేశారని, ఆ వెంటనే అనిత నాగేశ్వరావు ను చెప్పుతో కొట్టగా , అనిత కు పదివేల రూపాయల జరిమానా విధించారు. ఆ అవమానం మనసు లో పెట్టుకున్న నాగేశ్వర్ రావు కారేపల్లి మండలం దుబ్బ తండా కు చెందిన బానోతు నరేష్, వంకుడోత్ సంకి, చీమలపాడు కు చెందిన పేరం లక్ష్మయ్య లతో రు.50 వేలకు సుఫారి మాట్లాడుకొని రు. పది వేలు అడ్వాన్స్ ఇచ్చి ప్లాన్ ప్రకారం అనితను భద్రాచలం తీసుకొని వచ్చి, తదుపరి మిగతా వారు వచ్చి, ఆ రాత్రి మద్యం త్రాగి, అనిత కు మద్యం త్రాగించి ఆమె నిద్రలో యుండగా నాగేశ్వరావు అనిత చాతి పై కూర్చొగా వంకడోత్ సంకి, పేరం లక్ష్మయ్య ఆమె కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోగ, బానోత్ నరేశ్ కత్తి తో పొడిచాడని, అనిత నాగేశ్వర్రావు వేలును కొరకగా, ఇంకా బ్రతికే ఉందని తాను కూడా కతి తో పొడిచి టవల్ తో ఊపిరి ఆడకుండా చేసిచంపి శవాన్ని బాత్రూం లో పడేసి, శవం కు ఉన్న ఆభరణాలు దొంగిలించుకొని వెళ్లిపోయారని, అప్పటి ఏ. ఎస్. పి. సునీల్ దత్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసులు దర్యాప్తులో తేలగా నాగేశ్వరరావు తల్లి బోడ ద్వాలి నాగేశ్వరరావు భార్య బోడా లక్ష్మితో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని కోర్టులో ఛార్జిషీట్ అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సత్యనారాయణ రెడ్డి దాఖలు చేశారు. కోర్టులో పదహారు మంది సాక్షులను విచారించారు. బోడ నాగేశ్వరరావు ఇలియాస్ నగేష్, బానోతు నరేష్ పై నేరం రుజువు కాగా, వారిద్దరికి జీవిత ఖైదు, చేరి మూడు వేలు మొత్తం ఆరు వేలు జరిమానా విదిస్తూ తీర్పు చెప్పారు. కేసు విచారణ లో నాగేశ్వరరావు తల్లి బోడా ద్వాలి మరణించారు. మిగతా వారిపై కేసును కొట్టి వేశారు ప్రాస్క్యూషన్ను పబ్లిక్ ప్రాసెక్యూటర్ పోసాని రాధాకృష్ణమూర్తి నిర్వహించారు. కోర్టు లైజనాఫీసర్ ఎన్.వీరబాబు కోర్టు డ్యూటీ ఆఫీసర్ (కోర్ట్ పి. సి. వై. సుధీర్ )లు సహకరించారు.