సర్వేపల్లి నియేజికవర్గం వెంకటాచలం మండలంలోని కురిచెర్లపాడు గ్రామానికి చెందిన బొల్ల సుబ్బానాయుడు, పుంజులూరుపాడు గ్రామానికి చెందిన ఆరని నారాయణ రెడ్డి లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందారు.
ఆయా కుటుంబాలను ఆదుకోవాలని నారా భువనేశ్వరి గారు ”నిజం గెలవాలి” లో భాగంగా బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఈ రోజు వేదాయపాలేం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కార్యాలయం నందు ఆయన చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది.
తమకు ఆసరాగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసిన భాదిత కుటుంబ సభ్యులు.
ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల అధ్యక్షులు గుమ్మడి రాజ యాదవ్, కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్, మామిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు, యాకల రవి, మందా రమణయ్య, గిరి నాయుడు, పాపా నాయుడు, రామమూర్తి, సుధాకర్, వెంకట కృష్ణం నాయుడు, ఆరని మల్లికార్జున్ రెడ్డి, దాసి చక్రధర్, జగన్ మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.