151 Views
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఓ మహిళ రైతు వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది. గోనెగండ్ల మండలం పెద్ద నెలటూరు గ్రామంలో భూ వివాదంపై మహిళ రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ చాకలి వీరయ్య భార్య శివపార్వతి వీఆర్వోతో వాగ్వాదానికి దిగారు. తమ భూమిని వేరే వారి పేరు మీద అక్రమంగా ఆన్లైన్ చేశారని.. మిగిలిన భూమిని కూడా సాగు చేయకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శివ పార్వతి కోపంలో వీఆర్వో వేణుగోపాల్ చెంపపై కొట్టారు. వెంటనే ఆ పక్కన ఉన్నవారు ఆమెను ఆపారు. తాము చాలా రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా స్పందనలేదని.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. హోల్డ్‌లో ఉన్న భూమిని వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ భూ వివాదంపై అధికారులు స్పందించాల్సి ఉంది.