Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్ప్రత్యేక కథనం

గోదావరి పందెం కోడి కోసం థాయ్‌లాండ్ నుంచి వచ్చారు.. ఆ పుంజుకు అంత క్రేజా!

సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా నిర్వహిస్తుంటారు. అయితే అలా పందెం కోడిన సోషల్ మీడియా ద్వారా చూసిన థాయ్‌లాండ్ యువత.. ఇప్పుడు ఆ పందెం కోడి కోసం ఏలూరు జిల్లాకు వచ్చారు. తమకు ఆ పందెం కోడి కావాలని యజమాని దగ్గర బేరం పెట్టారు. ఆయన మాత్రం కోడిని ఇచ్చేది లేదని చెప్పడంతో.. మరో పుంజును కోనుగోలు చేశారు.

పందెం కోడి కోసం థాయ్‌లాండ్ నుంచి రావడం ఏంటని షాకవుతున్నారా.. మీరు వింటున్నది నిజమే. పందెం కోడి కోసం ఏకంగా థాయ్‌లాండ్ నుంచి నలుగురు యూత్ వచ్చారు. సోషల్ మీడియాలో వీడియో చూసి.. పందెం కోడిని కొనేందుకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కూరాకుల రత్తయ్య నాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో ఆయన తన పుంజుతో పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో ఏకంగా రూ.లక్షల్లో పందెం వేయగా.. ఆ పుంజు గెలిచింది.

ఈ పందెం కోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందట. దాన్ని చూసిన థాయిలాండ్‌కు చెందిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఆ పుంజును కొనడానికి బుధవారం రంగాపురానికి వచ్చారు. విక్రయించడానికి రత్తయ్య నిరాకరించడంతో.. ఎలాగూ వచ్చాం కదా అనుకున్నారా ఏమో ఆ కోడితో ఫొటో దిగి, మరో పుంజును రూ.3 లక్షలకు కొనుక్కుని పట్టుకెళ్లారు.

ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గం కోడి పందేలకు ఫేమస్ అని చెబుతుంటారు. స్థానికంగా నాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్న రత్తయ్యకు పందెం పుంజులు పెంపకంలో స్పెషలిస్ట్ అని చెబుతుంటారు. అలా రత్తయ్య పెంచే పందెం కోళ్లను చూడటానికి థాయిలాండ్ నుంచి యువత వచ్చారు. అంతేకాదు పందెం ఏ సమయంలో, ఏ గడియలలో, ఏ రంగు కు చెందిన పుంజు గెలుస్తుందో కుక్కుట శాస్త్రం చూడకుండానే చెప్పే సత్తా ఉన్నవాళ్లు ఆ ప్రాంతంలో ఉన్నారని చెబుతుంటారు.

Related posts

ys jagan: “జగన్ అనే నేను” – కౌంట్ డౌన్ క్లాక్ ప్లారంభం…!

HJNEWS

మారిన ఆళ్లగడ్డ లెక్కలు: అఖిలప్రియకు చెక్

HJNEWS

విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్