బాపులపాడు మండల పరిధిలో ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో 17 సంవత్సరములు నిండిన యువతీ, యువకులు పాల్గొనేందుకు గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు బాపులపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ కంబాల జోగేశ్వరరావు గారు తెలియచేసినారు. ఈ క్రీడలకు సంబంధించి కబాడీ, ఖో ఖో వాలీబాల్, షెటిల్ బాట్మింటన్, క్రికెట్ తదితర క్రీడలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ పంచాయితీలలో గెలుపొందిన జట్లు మండల స్థాయిలో జరుగు ఆటల పోటీలలో పాల్గొంటారని, మండల స్థాయిలో గెలుపొందిన జట్లు నియోజకవర్గ స్థాయిలో పోటీలలో పాల్గొంటారని, నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్లకు నగదు పారితోషకం అందజేయబడునని, కావున ఇంకా ఆసక్తి కలిగిన క్రీడాకారులు వారి యొక్క ఆదార్ కార్డు కాపీతో ఆయా గ్రామ సచివాలయ కార్యదర్శుల వద్ద రిజిస్ట్రేషను చేయించుకొనగలరని, ఒక క్రీడాకారుడు రెండు క్రీడలలో మాత్రమే పాల్గొనుటకు అర్హుడని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ కంబాల జోగేశ్వరరావు గారు తెలియచేసారు. ఇతర సమాచారము కొరకు శ్రీ పామర్తి వెంకటేశ్వరరావు, మండల క్రీడల కో-ఆర్డినేటర్, పోన్ నెం. 9491735353 ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమములో మండల విద్యాశాఖాధికారి శ్రీ రామబాలసింగ్ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తోటా వెంకట నాగేశ్వరరావు గారు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు 1) బి.ఎస్. రామచంద్రుడు 2) డి. సుబ్బారావు 3) టి.తానియాగిరి 4) కె. లక్ష్మణరావు 5) పి. వెంకటేశ్వరరావు 6) బి. వెంకటనాగమణి పాల్గొన్నారు.
previous post