నవోదయ పాఠశాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల..
జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు చేసుకునే స్టూడెంట్స్ 1-5-2012 నుంచి 30-07-2014 మధ్య జన్మించి ఉండాలి. అలాగే స్టూడెంట్స్ ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 2023-2024 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి.
ప్రవేశ పరీక్ష ద్వారా ఆరో తరగతిలోకి విద్యార్ధులను ఎంపిక చేస్తారు. నవోదయ గురుకుల పాఠశాలలో చదవాలనుకునే విద్యార్దులు ఆగస్ట్(August) 10వ తేదిలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అయితే జవహర్ నవోదయ విద్యా సంస్థ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 పాఠశాలలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 15ఉండగా తెలంగాణ(Telangana)లో 9 ఉన్నాయి.
భారత ప్రభుత్వ ఆధీనం లో నిర్వహించబడే జవహర్ నవోదయ విద్యాలయాలలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
జోహార్ నవోదయ విద్యాలయాలు భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి.
దీనికి సంబంధించిన 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదివే అభ్యర్ధుల కోసం ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్ట్ 10వ తేదిలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జె పి జె ఫార్మాట్లో విద్యార్థి ఫోటోపాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిచే జారీ చేయబడిన అభ్యర్థి విద్య అర్హత ధ్రువీకరణ పత్రంతో పాటు తల్లిదండ్రుల సంతకాలు, అభ్యర్థి సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం…
జవహర్ నవోదయ విద్యాలయం ఆరవ తరగతి లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేవారు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే వాళ్లు ఈ లింక్ క్లిక్ చేసి అర్హతలు ఇవే ..
జవహర్నవోదయ విద్యాలయంలో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు. వారి వయస్సు 01.05.2012 నుండి 31.07.2014 ఈ మధ్య తేదీలో జన్మించిన వారు బాల బాలికలు అర్హులు.
వెబ్సైట్ లో తమ వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.అలాగే జవహర్ నవోదయ విద్యాలయం స్థాపించబడిన జిల్లాలోని నివసించు అభ్యర్థులు మాత్రమే సంబంధిత విద్యాలయానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో అదే జిల్లాలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలి. ఐదవ తరగతి రెండుసార్లు చదివే అభ్యర్థులు అనుమతించబడరు.
జిల్లాలో కనీసం 75 సీట్లు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు కేటాయిస్తారు మిగిలిన సీట్లను పట్టణ ప్రాంత అభ్యర్థుల ద్వారా నింపడం జరుగుతుంది.