బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ‘వరద’ రాజకీయం హీటెక్కుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఈ రెండు పార్టీలు మాత్రం వరద సహాయంపై పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
వరద సాయం చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడికి టీపీసీసీ చీఫ్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలవడం కలకలం సృష్టిస్తోంది.
మల్కాజ్ గిరి ఎంపీ మిస్సింగ్ అంటూ తాజాగా పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. 2020, 2023 వరదల సమయంలోనూ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదని రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన పోస్టర్లు జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు. ఇప్పుడీ ఈ పోస్టర్లపై సంచలనంగా మారాయి.
రేవంత్ రెడ్డి ఈ పిలుపు ఇచ్చిన మరుసటి రోజే మల్కాజ్ గిరి ఎంపీ మిస్సింగ్ అంటూ పోస్టర్లు ఏర్పాటు కావడం చర్చనీయాశం అయింది.