Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
YSRCPఆంధ్రప్రదేశ్రాజకీయం

మళ్ళీ జగనే సీఎం-వార్ వన్ సైడ్ ..!!

38 Views

ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా జరిగింది. ఓటర్లు తీర్పు పూర్తయింది. ఫలితం మాత్రం జూన్ 4న వెల్లడి కానుంది. ఈ సమయంలోనే పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నేతలు తమదే విజయం అని చెబుతున్నారు. ఇటు ముఖ్యమంత్రి జగన్ గెలుపు పైన విశ్వాసం వ్యక్తం చేస్తూనే గెలిచే సీట్ల గురించి వివరించారు. అయితే, వైసీపీ ముఖ్య నేతలు మాత్రం ఎన్నికల ఫలితాల పైన ఆసక్తి కర విశ్లేషణ చేస్తున్నారు.

గెలుపు పై ధీమా ఎన్నికల ఫలితాల పైన పార్టీల నేతలు స్పందిస్తున్నారు. టీడీపీ నుంచి సోమిరెడ్డి కూటమి 135 సీట్లు గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల కంటే ఈ సారి వైసీపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. జూన్ 4న దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందన్నారు. ఇంత కంటే మంచి పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక..మంత్రి గుడివాడ అమర్నాధ్ వార్ వన్ సైడ్ విక్టరీ మాది…మళ్ళీ జగనే సీఎం అని ధీమాగా చెప్పుకొచ్చారు. గతంలో కంటే 1 సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని.. 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు.

జగనే మళ్లీ సీఎం వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాలను మూడు రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఎవరికి మ్యాజిక్ పిగర్ దాటకూడదని కోరుకుంటున్నామన్నారు. తమ పార్టీ అవసరం ఉన్న కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని… తిరిగి జగన్ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు.

పెరుగుతున్న ఉత్కంఠ పోలింగ్ శాతం పెరిగింది అని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ పడిందని ప్రచారం చేస్తున్నారని.. ఇది తప్పని చెప్పుకొచ్చారు. గతంలో మహా కూటమిలాగా… ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేకే దాడులు జరుగుతున్నాయన్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో 85 శాతం లబ్ది పొందారని.. అందుకే తమ విజయంపై ధీమాగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయం పైన ధీమా వ్యక్తం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీ మద్దతు దారులు భారీ ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు.

Related posts

Elementor #HJNEWS.IN

HJNEWS

HJNEWS

స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్