జర్నలిస్టు ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యత తో పోరాడి సాధించుకుందామని వనపర్తి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంబటి స్వామి అన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలో ని జడ్పీ సమావేశ మందిరం లో వనపర్తి జిల్లా ప్రెస్ క్లబ్ సమావేశం భక్త రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ విలేకర్లను విడదీసి పాలిస్తున్న జర్నలిస్టు యూనియన్ల నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. కొంత మంది జర్నలిస్టులు యూనియన్లను అడ్డుపెట్టుకుని తోటి విలేకర్లకు తీరని అన్యాయం చేశారని చెప్పారు. వనపర్తి ప్రెస్ క్లబ్ ను విచ్చిన్నం చేయుటకు కుట్రలు చేస్తున్నారని, దాన్ని మనం తిప్పికొడుదామన్నారు.c ఆయన గుర్తు చేశారు. వారి కుట్రలను తిప్పికొడుదామన్నారు.v వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్టు లకు కేటాయించిన ఇంటి స్థలాల విషయం లో అప్పటి జర్నలిస్టు యూనియన్ నాయకులు మోసం చేశారని ఆయన చెప్పారు. గతంలో రెండు, మూడు సార్లు ప్లాట్లు పొందిన వారే మళ్ళీ ప్లాట్లు తీసుకుని అర్హులైన జర్నలిస్టు లకు, న్యాయంగా దక్కాల్సిన వారికి అన్యాయం చేశారని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టు లకే కాకుండా రిటైర్డ్ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు ప్లాట్లు కేటాయించడం శోచనీయ మన్నారు. గత పాలకులను అడ్డుపెట్టుకుని జర్నలిస్ట్స్ మోసాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. మళ్లీ ఇప్పుడు ప్రెస్ క్లబ్ ముసుగులో జర్నలిస్టు లను మోసం చేయుటకు పాత జర్నలిస్ట్ యూనియన్ వారు ప్రయత్నిస్తున్నారని, వారి తీపి మాటలు నమ్మి మరో సారి మోస పోవద్దన్నారు. ప్లాట్లు రాని జర్నలిస్టు లు ఐక్యత తో ఉండి ప్లాట్లు సాధించుకోవాలన్నారు. ప్రెస్ క్లబ్ సారథ్యంలో అందరం ప్లాట్లు సాధించుకుందామన్నారు. అంతకు ముందు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు స్వామి, పవన్ లను శాలువా, బోకెలతో సన్మానించారు. ఈ సమావేశంలో సీనియర్ రిపోర్టర్స్ దశరథం, పూరి సురేష్, లింగం గౌడ్, రామకృష్ణారెడ్డి, రవి శంకర్ గౌడ్, సంతోష్, రిపోర్టర్స్ హుస్సేన్, శేఖర్, రవి ప్రసాద్, ఆంజనేయులు యాదవ్, సాయిరాం, కృష్ణయ్య, నరసింహ రాజు, విష్ణు, శ్రీనాథ్ , రవి , ప్రవీణ్ ,బండి రాజు, అశోక్ గౌడ్, ఆంజనేయులు, కృష్ణ , ఖలీల్, అరుణ్ కుమార్, మనోహర్, స్వామి, బాలు, లక్ష్మీనారాయణ, పర్వతాలు, అశోక్, బాలకృష్ణ, కుర్మయ్య, అలీ,జియ, రమేష్, ఎం. కృష్ణ, వేణుగోపాల్, మన్నెం, వి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
previous post